*తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందించాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న*
నేటి గదర్ కరకగూడెం : రైతులకు పండించిన పంటకు సరిపడా యూరియా అందడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం పార్టీ మండల కమిటీ సమావేశం కనితి రాము అధ్యక్షతన రేగళ్ల గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పంటలు ఎరువుల దశ దాటిపోతున్న ఎరువులు లేక పంటలు ఎలా పండించుకోవాలో అని రైతాంగం దిగాలు చెందుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై తీవ్రమైన వివక్ష చూపిస్తుందని నెలలు గడిచిపోతున్న ఈ సీజన్ పంట కాలం పూర్తి నాటికైనా యూరియా వస్తుందో రాదో అనే నమ్మకం లేకుండా పోయిందని వారన్నారు. దీన్ని చూస్తేనే రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని వారన్నారు ఇలాగే కొనసాగితే రైతులను కూడగట్టి ప్రత్యక్షంగా ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు, చర్ప సత్యం, పదం బాబురావు తదితరులు పాల్గొన్నారు .









