బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక…. పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల దివాకర్ రెడ్డి.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ ,ఇది ముఖ్యంగా మహిళలు జరుపుకునే పండుగ బతుకమ్మ అనగా బతుకు అమ్మ ,అని అర్థం. అంటే మన కుటుంబం ,పిల్లలు ,భర్త ,తల్లిదండ్రులు అందరూ సుఖసంతోషాలతో బతకాలని ప్రార్థించటమని, ఈ పండుగను అశ్వయుజ శుద్ధ పద్మి నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారని ,చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారని, బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలతో, పెద్ద బొమ్మ లాంటి పూలదండలు తయారుచేసి వాటిని నది లేదా చెరువు లేదా బావిలో వదిలేస్తారు అని ,మహిళలు సాంప్రదాయ బట్టలు ధరించి బతుకమ్మ చుట్టూ చేరి పాటల పాడుతూ ఆటలాడుతూ ఈ పండుగలో తల్లి భూదేవిని, గౌరీదేవిని పూజిస్తారని ,కుటుంబంలో సుఖసంతోషాలు ,ఆరోగ్యం ,సంపద సంతానం, కోసం పూజ చేస్తారని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ అయిన ఇనుకుల సుధాకర్ రెడ్డి ,వాహిని రెడ్డి, కవితా రెడ్డి, తిరుపతిరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి తన్నీరు రామారావు ,వైస్ ప్రిన్సిపల్ చాపల మడుగు తిరుపతిరావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









