+91 95819 05907

ప్రజా సమస్యలను పరిష్కరించండి అధికారులను ఆదేశించిన* నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి

*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్20

మెదక్ జిల్లామాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు,
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వంటి వాటిపైసంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సునీత రెడ్డి సమీక్ష
జరిపారు ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో
నిధులు లేకున్నా తమ సొంత డబ్బులు వెచ్చించిపారిశుద్ధ్యం, నిర్వహణ, మంచినీటి సరఫరా తడి
పొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు
వివరించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలు వివరాలు, ఇల్లు
వివరాలను వివరించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వపాఠశాలలు అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు
చేరుకున్నాయని నూతన బిల్డింగ్లకు నిధులుమంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. రామంతాపూర్ తండాలో రెండు వాటర్
ట్యాంకులకు మంజీరా నీటి సరఫరా రావడం లేదని,గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రం భవనాలకు
నిధులు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం
తో ఇబ్బందులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులపై పని భారం ఎక్కువ అయిందని,గుర్తింపు ఉండడం లేదని పంచాయతీ కార్యదర్శులు
వాపోయారు. నిధులు లేక తమ సొంత డబ్బులువెచ్చించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయనితెలిపారు. పక్క రాష్ట్రాల్లో పంచాయతీ కార్యదర్శులకు
మంచి గుర్తింపు ఉందని కానీ తెలంగాణలో మాత్రంకిందిస్థాయి వర్కర్లుగా చూస్తున్నారని ఈ పద్ధతిని
మార్చేలా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలనుతీసుకెళ్లాలని కోరారు. సమీక్ష నిర్వహించిన అనంతరం పలు గ్రామాలకు చెందిన ప్రజలు సమస్యలపైఎమ్మెల్యేకు వినతిపత్రం అందచేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !