నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్ 19.
మెదక్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చిలిపి చెడు మండల కేంద్రంలో 4,37,000 విలువగల 12 చెక్కులను అందజేసారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ( సి.ఎం.ఆర్.ఎఫ్) ద్వారా మంజూరైన మొత్తం 4,37,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ సహాయం మాకు నిజమైన భరోసాగా నిలిచిందిఅని అన్నారు. వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా కుటుంబాలకు ఇది ఆశాకిరణంగా మారిందిఅని. ఈ సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ మా సమస్యలను పట్టించుకుని, సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.









