+91 95819 05907

మూడు మండలాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం. పోలీస్ కమీషనర్ సునీల్ దత్.

నేటి గదర్ న్యూస్
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరస్థులకి శిక్షల శాతం మరింత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో కేసుల దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు.
శుక్రవారం ముదిగొండ, బోనకల్, చింతకాని పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.
సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కు ప్రాథన్యత ఇవ్వాలని అన్నారు. నేరాల నియంత్రణ, కేసు దర్యాప్తులు, ప్రజా భద్రత కోసం అమలు చేస్తున్న ప్రత్యేక చర్యలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రతేక దృష్టి సారించాలని అన్నారు.
అక్రమ రవాణా, దందాలు, అసాంఘిక కార్యకాలాపాలపై కఠినంగా వ్యవహారించాలి ఆదేశించారు.నేరాల నియంత్రణలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజల మనసులు చూరగొనాలని అన్నారు. ప్రజలకు ధైర్యం కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ ను అనుసరించాలంటూ దాని ప్రాధాన్యాన్ని వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు డివిజన్ పోలీస్ అధికారులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ అధికారుల పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శించి, పనితీరును సమీక్షించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని,
అదేవిధంగా, నేర పరిశోధనలు మరియు అరెస్టులలో సహాయపడే సిసిటివి కెమెరాలతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు.
డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల ధోరణిని ఎదుర్కోవడానికి, అవగాహన మరియు నివారణను పటిష్టమైన సాంకేతిక చర్యలను అమలు చేయాలని అధికారులను కోరారు.విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, పెట్రోలింగ్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
యువత మాదకద్రవ్యాల వ్యసనం మరియు నేర కార్యకలాపాలకు బలైపోకుండా నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉండేలా సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు ముందస్తు, సమాచారం, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రజా భద్రతను పెంపొందించే ప్రయత్నంలో, చోరీ కేసుల్లో నిందుతులను అరెస్టు చేయడం, అలవాటు పడిన నేరస్థులను ట్రాక్ చేయడం మరియు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా రైతులకు అందించే యూరియా పంపింణి సమయంలో
సమస్యలు తల్లెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
సమావేశంలో సిసిఆర్బి ఇన్స్పెక్టర్ స్వామి, మురళి, ఎస్సై లు పాలొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !