+91 95819 05907

ప్రభుత్వం స్పందించాలి, సమ్మెను విరమింప చేయాలి… …. భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా:-
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కార్మికులు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరియు గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికీ స్పందించకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు.

గిరిజన సంక్షేమ శాఖ వెంటనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేయకపోగా, ఇప్పటికే ఇస్తున్న వేతనాలను తగ్గించి శ్రమదోపిడీకి పాల్పడటం అమానవీయమని విమర్శించారు.

కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కార్మికులుగా పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు, సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ప్రభుత్వం సమ్మె పట్ల తక్షణమే స్పందించకపోతే వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల, కామేపల్లి మండలాలతో పాటు మొత్తం జిల్లావ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో, గిరిజన హాస్టల్ వద్ద జరుగుతున్న సమ్మె శిబిరాలను సందర్శించి కార్మికులను సమీకరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అధికార పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు కూడా వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !