పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్
రూ.4 కోట్ల బిల్లులు ఇవ్వడం లేదని హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి
ఏడాది క్రితం కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుండి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవ కార్యక్రమాలు
ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా హాజరుకానున్న పలువురు మంత్రులు
కార్యక్రమం కోసం వెళ్లగా, తాళం వేసి ఉండడంతో ఖంగుతిన్న అధికారులు
కార్యక్రమాలు జరగకుండా తాళం వేసినందుకు కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Post Views: 23









