– మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాల చేరిక.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తి రోజురోజుకి పెరుగుతున్నది. తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన ముదిరాజు వర్గానికి చెందిన సుమారు 40 కుటుంబాలు ఆదివారం బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పార్టీలో చేరుతున్న వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుని వస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల మనసులు గెలుచుకుంటున్నాయని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ గౌడ్, నాయకులు జడల రమేష్, చీకటి శ్రీను, బాజా సత్యనారాయణ, నేలమర్రి నాగేందర్, సోమనబోయిన మహేష్, మల్లారపు యాకన్న, షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.









