+91 95819 05907

డాడీ కి గిఫ్ట్ గా ….ఎంబీబీఎస్ సీట్ సాధించిన యువకుడు

పేదింటి బిడ్డకు ఎంబీబీఎస్ సీటు
: అభినందిస్తున్న శ్రీ వశిష్ట జూనియర్ కాలేజ్ మియాపూర్ యాజమాన్యం
: ఆనందంలో తండ్రి బూరుగడ్డ సత్యనారాయణ

పినపాక, సెప్టెంబర్ 21:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మద్దెల గూడెం గ్రామానికి చెందిన పేదింటి బిడ్డకు నీట్ 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ప్రభుత్వ వైద్య కళాశాల వికారాబాద్ లో ఫ్రీ ఎంబీబీఎస్ సీటును సాధించాడు, వివరాలకు వెళితే పినపాక మండలం మద్దెల గూడెం గ్రామానికి చెందిన బూరుగడ్డ సత్యనారాయణ కుమారుడు బూరుగడ్డ జగదీష్ 2025 మెడికల్ ఎంట్రన్స్ లో కేటగిరి 208 ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటును సాధించాడు. తన తండ్రి ఒక సాధారణ వ్యవసాయ కూలీ చిన్న చిన్న వ్యవసాయ పనులు చేస్తూ, కొడుకుని ఎంబిబిఎస్ డాక్టర్ చేయాలనే తన తండ్రి కలను నిజం చేస్తూ బూరుగడ్డ జగదీష్ మెడికల్ సీట్ సాధించి తన తండ్రికి మెడికల్ సీటు రూపంలో గిఫ్ట్ ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ, చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించిన బూరుగడ్డ జగదీష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు, తర్వాత చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు, అనంతరం శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్లో నీట్ ఎంట్రెన్స్ కోచింగ్ తీసుకొని, ప్రభుత్వ మెడికల్ కళాశాల వికారాబాద్ లో ఫ్రీ వైద్య సీటును సాధించి, ప్రతిభ ఉండాలే కానీ పేదరికం లో చదివిన విద్యార్థులు తక్కువేం కాదంటూ జగదీష్ నిరూపించాడు, కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీని మొక్కవోని దీక్షతో పట్టుదలతో తండ్రి కలను సహకారం చేస్తూ, వైద్య (ఎమ్ బి బి యస్ ) సీట్ సాధించటం ఆ కుటుంబం సంతోషించే విషయం, నీట్ 2025 ఎంట్రెన్స్ క్వాలీఫై అయ్యి ఎమ్ బి బి యస్ సీటు సాధించిన భూరుగడ్డ జగదీశ్ కుటుంబ సభ్యుల తోపాటు స్నేహితులు, వారి బంధువులు మరియు శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్ యాజమాన్యం చైర్మన్ ప్రమీల రాణి, జనరల్ మేనేజర్ వంశీ చందు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉపేందర్, ప్రిన్సిపాల్ నవీంద్ర అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బూరుగడ్డ జగదీశ్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కష్టపడి ఇష్టంతో చదివితేనే ఏదైనా సాధించగలమని దీని అంతటికీ శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ మియాపూర్ యాజమాన్యం అందించిన కోచింగే కారణం అని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !