నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక &విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అదనంగా 14 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినారు. గ్రామంలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు, గతంలో ఎక్కడైతే అవసరము ఉన్నదో దాన్ని గుర్తించిన చోట,
విద్యుత్ స్తంభాలు దూరం ఎక్కువ ఉన్నచోట ఈ కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమంలో చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల నాగార్జున,విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు అరువురి వెంకటేశ్వర్లు,తోటకూరి హరీష్,తన్నీరు పుల్లయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టెల కృష్ణ,ముల్లంగి మురళి, గ్రామ ఉపాధ్యక్షుడు యరమాల ప్రసాద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె సైదా, కొత్తపెళ్లి రామకోటి,వజ్రాల వెంకటేశ్వర్లు,ఎరకల వెంకటేష్, కొత్తపెళ్లి నరసయ్య,ఎర్రమల కృష్ణ. అలవాల వెంకటేశ్వర్లు, కొత్తపెళ్లి నగేష్, విద్యుత్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









