* లబ్ధిదారులకు అందజేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్, తదితరులు
* ఎంపీ రామ సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఉభయ జిల్లాల లబ్ధిదారులు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం: పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి 97 మంది లబ్ధిదారులకు రూ. 41 లక్షలు మంజూరయ్యాయి. కాగా లబ్ధిదారులకు.. ఖమ్మం గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ చెక్కులు అందజేశారు.
ఎంపీ రఘురాం రెడ్డి ప్రత్యేక చొరవతోనే పేదలకు లబ్ధి..
ఈ సందర్భంగా..పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ రఘురాం రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి.. అర్హులైన పేదలందరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్సలు పొందిన పేదలను ఆదుకునేందుకు.. వేగంగా ఆర్థిక తోడ్పాటు అందేలా చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు పొందిన లబ్ధిదారులు.. ఎంపీ రఘురాం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రఘునాథపాలెం మండలాధ్యక్షులు బాలాజీ నాయక్, ఏన్కూరు మండలాధ్యక్షులు స్వర్ణ నరేందర్, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు, టీఏసీ మెంబర్ ఉమ్మినేని కృష్ణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల నాగేశ్వరరావు, నాయకులు ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షులు అర్వపల్లి శివ, బోడా శ్రావణ్, కాంపాటి వెంకన్న, మైనార్టీ నాయకులు గౌస్, ఐఎన్ టీయూసీ నాయకులు విప్లవ కుమార్, గురుమూర్తి, కరాటే వేణు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.









