నేటి గదర్ కరకగూడెం: ప్రతి సంవత్సరం లాగే ఫోటోగ్రాఫర్ చనిపోయిన కుటుంబాలకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున వారి కుటుంబాలకు ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, శక్తి డిజి ప్రెస్ అధినేత మధుసూదన్ రెడ్డి 30,000 చెక్కు రాష్ట్రవ్యాప్తంగా ఆరు కుటుంబాలకు గాను అందజేయడం జరిగింది దీనిలో భాగంగా పినపాక కరకగూడెం మండలాల అసోసియేషన్ సభ్యుడు ముంజాల ప్రవీణ్ కుమార్ గౌడ్ మరణించడంతో వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కరకగూడెం పినపాక మండలాల ఫోటోగ్రాఫర్లు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుణగంటి సారయ్య జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి కరకగూడెం మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్,గౌరవ సలహాదారులు గుమ్మడవెల్లి.ప్రసాద్ పాల్గొన్నారు.









