నేటి గదర్ చింతకాని ప్రతినిధి :
ఖమ్మం/చింతకాని : తొలి రౌండ్ లో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన పాతర్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి మనీషా(SC) కు.ఖమ్మం పాకబండ బజార్లో నీ తన నివాసంలో నన్నక శ్రీనివాసరావు యూనివర్సిటీ అలాటుమెంట్ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ నిమిత్తం 12వేల రూపాయలు ఆర్ధిక చేయూతనిచ్చారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం లో జన్మించి ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన మనీషా ను నన్నక అభినందించారు. మునుముందు మంచి వైద్యురాలి గా పేరు తెచ్చుకోవాలని నన్నక శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నన్నక శ్రీనివాసరావు తల్లిదండ్రులు నన్నక లచ్చయ్య , రంగమ్మ , భార్య పుస్పలత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 172









