*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 23.
మెదక్ జిల్లా మసాయిపేట లో ప్రతీ గ్రామానికి క్యూఏస్ఈవి (క్వాలిటీ సీడ్ ఇన్ ఎవ్రీ విలేజ్) ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించామని, తద్వారా గ్రామానికి అంతటా నాణ్యమైన విత్తనాలు అందిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఎం ఏ ఓ. ఝాన్సీ (ఎల్దుర్తి ) మరియు రజిత (మాసాయిపేట) తో కలిసి సోమవారం ఎల్దుర్తి మరియు మాసాయిపేట గ్రామాలలో పర్యటించి యూనివర్సిటీ ద్వారా విత్తనాలు అందించి సాగుచేస్తున్న ఏం టి యు 1010 రకాన్ని పరిశీలించారు. రైతులు కృష్ణయ్య, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 115









