*నేటి గదర్ న్యూస్ గుండాల*, మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుండాల పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలో ముమ్మర తనిఖీలను చేపట్టారు. గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై సైదా రావుఫ్ సిబ్బందితో కలిసి మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే రహదారుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వాహనాలకు అనుమతినిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా గ్రామాలలో తనిఖీలను చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మండలంలోని గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే ఎవరైనా అనుమానితులుగా అనిపిస్తే గుండాల పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 56









