నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం పెద్దతండా లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నుంచి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సంస్థ ఉద్యోగుల తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన వారికి తగు సూచనలు,సలహాలు అందించారు.ముందుగా గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.గిడ్డంగుల సంస్థ ఉద్యోగులకు బోనస్ ఇస్తామని ఆయన అన్నారు..ఇంకో 5000 Mts పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం అక్యుపెన్సీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సాధించినట్లే అన్నారు.ఇందులో అందరూ బాగా పని చేశారని ఇంకా బాగా పని చేయాలని ఆయన తెలిపారు.అందరూ ఆర్.యం. లు స్టోరేజ్ చార్జెస్ పెండింగ్ త్వరగా వసూలు చేయాలన్నారు.తద్వారా కార్పొరేషన్ ను అభివృద్ధి లో నడిపించాలని చెప్పారు.హైదరాబాద్ రీజిన్ లో స్టోరేజ్ చార్జీలు ఎక్కువ పెండింగ్ ఉన్నాయన్నారు.గోడౌన్ లో నిల్వ ఉన్న స్టాకును టైమ్ టు టైమ్ పురుగుల రాకుండా కాపాడాలని పురుగులు లేకుండా PDS పంపాలని ఆయన చెప్పారు..అందరం కలిసి పని చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడదామని ఆయన పిలుపునిచ్చారు..









