నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాణసంచా దుకాణాలు పెట్టుకోదలచిన వ్యాపారులు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 01 తేది సాయంత్రం లోపు ఆయా డివిజన్ పరిధిలోని ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) కార్యాలయాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ధరఖాస్తుతో పాటు AE-5 ఫామ్, సెల్ఫ్ అఫిడవిట్ , చలానా రిసీప్ట్,. ఆధార్ కార్డ్ , ఫోటో జతపరచి ఏసీపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.
అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ హెచ్చరించారు.









