నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలంలోని లచ్చగూడెం, చింతకాని, ప్రొద్దుటూరు మరియు నాగులవంచ గ్రామాల్లోని ఫెర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి ధనసారి పుల్లయ్య మంగళవారం నాడు తనిఖీ చేసినారు.ఎరువుల స్టాక్ రిజిస్టర్,ఫార్మర్ సేల్ రిజిస్టర్,బిల్ బుక్,ఇన్వాయిస్ లను పరిశీలించారు.స్టాక్ బోర్డ్ తప్పనిసరిగా ప్రతిరోజు అప్డేట్ చేయాలని మరియు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని దుఖానాదారులకు సూచించారు.రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని మనకు జిల్లా నుంచి ఎప్పటికప్పుడు మండల కోటను కేటాయిస్తున్నామని రైతులు ఎవరు ఆందోళన చంద వద్దని తెలిపారు. అలాగే ప్రవేట్ ఎరువుల డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించవద్దని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస పాల్గొన్నారు.









