*కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడయాత్ర.*
నేటి గదర్ కరకగూడెం:ఈరోజు కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా మండల జేఏసీ యువత ఉత్సాహంగా ఛలో భద్రాచలం ధర్మయుద్ధం బహిరంగ సభ జోడయాత్రను విజయవంతంగా నిర్వహించారు.
ఆదివాసి తెగల రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ ఏడుల్ల బయ్యారం వద్దకు చేరుకోగానే కరకగూడెం మండల జేఏసీ తరఫున ఘన స్వాగతం పలికారు.
కలవలనాగారం గ్రామంలో ఆదివాసి మహిళలు సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులు పట్టి, విద్యార్థి సంఘం బట్టు వెంకటేశ్వర్లు గారు చుంచు రామకృష్ణ కి బొట్టు పెట్టి, కంకణం కట్టి, కొమరం భీం కు పూలమాలలు వేసి కొమరం భీం జోహార్లు అర్పించారు. ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.
కొమరం భీం సెంటర్ వద్ద మండల ఉద్యోగ సంఘం నాయకులు తరఫున రామకృష్ణ గారికి పుష్పగుచ్చం సమర్పించారు. అక్కడ కొమరం భీంకు పూలమాలు వేసి కొమరం భీం జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను,ప్రజలకు ఉద్యమ సందేశాన్ని అందించారు.
కొర్నవల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో కొమరం భీం గద్దె వద్ద శాలువా కప్పి చైర్మన్ గారిని సన్మానించారు.
తరువాత మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, సిరుమళ్ళ గ్రామంలోని సమ్మక్క సారలమ్మ గద్దె వరకు ర్యాలీగావెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అక్కడి ప్రజలను,పెద్దలను, యువతను,అందరినీ ఛలో భద్రాచలం ధర్మ యుద్ధ సభ కు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
అలాగే బర్లగూడెం, రఘునాథపాలెం, గ్రామాల్లోని సార్లమ్మ, గాదె రాజు, దేవతలను దర్శించి ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు.ఈ జోడయాత్రతో కరకగూడెం మండలం ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం నింపబడింది.సెప్టెంబర్ 28న జరగబోయే ఛలో భద్రాచలం ధర్మయుద్ధ సభను_ విజయవంతం చేయాలని అందరూ గట్టిగా సంకల్పించారు.









