నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సభ్యులుగా ఖమ్మంకు చెందిన బాగం హేమంతరావు ఎన్నికయ్యారు.ఛండీఘర్లో ఈనెల 21 నుంచి 25 వరకు జరిగిన జాతీయ మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. బాగం హేమంతరావు నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు ఏఐఎస్ఎఫ్ నాయకునిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన హేమంతరావు భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఖమ్మంజిల్లా కార్యదర్శిగా సుదీర్ఘ కాలం -పనిచేశారు. డిసిసిబి ఉపాధ్యక్షులుగా పనిచేసిన హేమంతరావు ప్రస్తుతం ముఠాపురం పిఎసిఎస్ అధ్యక్షులుగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పని చేస్తున్నారు.జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు, ప్రజా ఉద్యమ నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత వసంత ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని ఆ ముగింపు సభ జయప్రదంపై -దృష్టి సారించనున్నట్లు హేమంతరావు తెలిపారు.









