ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుంది.
🛣️హైవే ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోంది. రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
🛣️పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద హైవే పనులను, ఎంట్రీ–ఎగ్జిట్ ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యేలు మట్టా రాగమయి గారు, రాం దాస్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, NHAI అధికారులు, స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది.
🛣️భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే ఇచ్చిన ధరకు అదనంగా రైతుల డిమాండ్ ప్రకారం 12 శాతం నష్టపరిహారం చెల్లించాలని NHAI అధికారులను ఆదేశించాము.
🛣️హైవే నిర్మాణంలో ముక్కలుగా మిగిలిన రైతు భూములకు కూడా నష్టపరిహారం అందించేలా చూస్తాం.
🛣️రైతుల సాగుకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్లను నిర్మించాలని, అవసరమైన మేర డ్రెయిన్‌లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.









