నేటి గద్దర్ న్యూస్, చండ్రుగొండ, సెప్టెంబర్, 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, పోకలగూడెం గ్రామానికి చెందిన ముత్తిని లావణ్య హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెంటనే స్పందించారు. ఆమెకు అత్యవసరంగా అవసరమైన శస్త్రచికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ. 1,10,000 (లక్షా పదివేల రూపాయలు) విలువైన ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, ఆ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం, సంబంధిత వైద్యులతో మాట్లాడి, లావణ్యకి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వారికి ప్రత్యేకంగా సూచించారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలబడిన ఎమ్మెల్యే చర్యను స్థానికులు అభినందించారు.
Post Views: 37









