*నేటి గదర్ న్యూస్ గుండాల*, అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క మండలంలో బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు, మండలం పరిధిలోని పగిడిద్దరాజు గద్దెల సమీపంలో గల జయశంకర్ నగర్ లో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో విమలక్క పాల్గొని అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మను ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకృతి రక్షణ ప్రజల రక్షణగా ఉంటుందని ఆమె అన్నారు. అడవులను కాపాడడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని అడవులను ధ్వంసం చేయడం ద్వారా మానవాళికి ముప్పు ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రకృతిని విధ్వంసం అంటే అడవులతో పాటు నాగరికతను ధ్వంసం చేయడమే అని ఆమె అన్నారు. అక్కడి ప్రజలకు ప్రకృతి పర్యావరణం గురించి ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిది రోజుల బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఆరో రోజు గుండాల మండలంలో నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ సంవత్సరం ఉస్మానియా ఆర్ట్ కాలేజీ ప్రాంగణంలో ఆట పాటలతో ప్రారంభించి చివరిగా ఉప్పల్ మండలంలో ముగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రజలు ప్రకృతిని కాపాడడం కోసం చైతన్యవంతులై ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రుద్ర, సమ్మయ్య, మలుసర్ తదితరులు పాల్గొన్నారు









