●ఏ ఐ డి డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు
భారతదేశంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆడపిల్లల వివాహాలు 69% మరియు బాలుర వివాహాలు 72% తగ్గాయని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏఐడీ సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరిప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ విడుదల చేసిన *టిప్పింగ్ పాయింట్ టు జీరో ఎవిడెన్స్ టు వర్డ్స్ ఫ్రీ భారత్* అను నివేదిక బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బలమైన నిరోధకాలుగా ఎఫ్ఐఆర్లు మరియు న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సాధ్యమైంది అని తెలుపుతుందన్నారు
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ భాగస్వామి అయిన యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ జిల్లా పరిపాలన గ్రామ పెద్దలు మరియు పిల్లల రక్షణ కోసం కమ్యూనిటీ కార్యకర్తల సంబంధంతో పనిచేస్తుందని గత మూడు సంవత్సరాలలో ఎన్నో బాల్యవివాహాలను ప్రాథమిక దశలోనే గుర్తించి నిలుపుదల చేసింది అని తెలిపారు
బాలివివాహాలను అంతం చేయడానికి తమ సంస్థ ఖమ్మం సూర్యాపేట మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముందు వరుసలో ఉండి అధికారులు మరియు వివిధ సంఘాలతో చేయి చేయి కలిపి పని చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నామని డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు అన్నారు
క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పిల్లలు చదువుకోవడానికి వారు వయోజనులై ఎదగడానికి అపార అవకాశాలను పొందే భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు 2030 నాటికి పిల్లలపై జరిగే ఈ నేరాన్ని అంతం చేయడంలో విద్య అవగాహన మరియు చట్టపరమైన చర్యలు అనే సాధనాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు
గతవారం దేశవ్యాప్తంగా చేపట్టిన మతాధికారుల బాల్య వివాహ నిరోధక ప్రతిజ్ఞ సంచలనం సృష్టించిందని, బాల్ వివాహముక్తుభారత్ ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ నినాదంగా తీసుకున్నారని 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన *హోల్ కంట్రీ హోల్ సొసైటీ ఫర్ బాల్ వివాహ ముక్త్ భారత్* సత్ఫలితాలను అందిస్తుందని తెలిపారు
విద్యాపరంగా దేశంలో చేయబడిన సర్వేలో 31 శాతం గ్రామాల్లో 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలికలు పాఠశాలకు హాజరవుతున్నారని, బాలికల విద్యలు పేదరికం 88% మౌలిక సదుపాయాల కొరత 47% భద్రత 42% మరియు రవాణా లేకపోవడం 24% అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నారు ముఖ్యంగా బాల్యవివాహాలకు దారి తీసిన కారణాలలో 91% పేదరికం మైనర్ బాలికకు భద్రత కల్పించడంలో విఫలమవుతామని అభద్రతాభావం తల్లిదండ్రుల్లో ఉన్నట్టు గుర్తించారు
బాల్య వివాహం అనే సాంఘిక దురాచారాన్ని అంతం చేయడానికి భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ జస్ట్ రైట్స్ ఫర్ న్ రవికాంత్ ఇలా అన్నారు
వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలలో చట్టభయాన్ని తొలగించడానికి రక్షణ మరియు ప్రాసిక్యూషన్ నమూనా దేశవ్యాప్త ఫలితాలను పొందుతుందని పై నివేదిక తెలుపుతుందని ప్రభుత్వాలు పరిపాలనలు పోలీసులు సామాజిక కార్యకర్తలు మరియు గ్రామ పెద్దల సమన్వయంతో ఈ ప్రయత్నం కొనసాగిస్తే భారతదేశము 2030 నాటికి బాల్య వివాహ రైతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు
కావున ఇది ఒక జాతీయోద్యముల మారిందని ప్రతి ఒక్కరు కూడా బాలల యొక్క మెరుగైన భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల ఆధారంగా వారికి సరైన అవకాశాలను కల్పిస్తూ పరిపక్వతతో నైపుణ్యత కూలినటువంటి యువ భారతీయులను తయారు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాద్ రావు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్స్ కే శ్రీనివాస్ వి రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు









