+91 95819 05907

స్థానిక ఎన్నికలకు సిపిఎం సిద్ధం….”★ సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

స్థానిక ఎన్నికలకు సిపిఎం సిద్ధం….

సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

నేటి గదర్ న్యూస్, వైరా:-
నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులను స్థానిక ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని, స్థానిక ఎన్నికలకు సిపిఎం సిద్ధంగా ఉందని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు. శనివారం సిపిఎం వైరా మండల కమిటీ సమావేశం స్థానిక బోడెపూడి భవన్ లో డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ఇప్పటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక అధికారుల పరిపాలనలో అస్తవ్యస్తంగా తయారైందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని విమర్శించారు, అన్ని గ్రామాల్లో మండలాల్లో సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై సర్వేలు నిర్వహించి గ్రామపంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలు వద్ద సమస్యలు పరిష్కరించాలని ప్రజల పక్షాన పోరాడిందని, భవిష్యత్తులో కూడా పోరాడుతుందని ఆయన తెలిపారు, ప్రజా సమస్యలపై స్థానిక సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ను ప్రజలు బలపర్చాలని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు, ప్రభుత్వాలను ప్రశ్నించి పోరాడి నిధులు సాధించాలంటే సిపిఎం గెలవటమే మార్గమని ఆయన గుర్తు చేశారు, స్థానిక ఎన్నికలకు సిపిఎం శ్రేణులు సిద్ధం కావాలని ప్రజల మద్దతును కూడగట్టాలని కోరారు, సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తుము సుధాకర్, మండల నాయకులు బాజోజి రమణ, కిలారు శ్రీనివాసరావు, మేడా శారాబంది, షేక్ మజీద్, శీలం వెంకట్ రెడ్డి, కారుమంచి జయరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !