ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పాకాలపాటి శేషగిరి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, పాపటపల్లి గ్రామంలో గల ఎంపీటీసీ పరిధిలో ముఖ్య నాయకులు,బూతు కమిటీ సభ్యులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపటపల్లి ఎంపీటీసీ ఇంచార్జ్ ఎండీ ఖాదర్ బాబా, వి ర్ బంజార్ ఇంచార్జీ పాలకపాటి శేషగిరి పాల్గొని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అందరూ కలసి కట్టుగా పని చేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం లో ఉన్న రఘునాథపాలెం మండలంలో అభివృద్ధికి ఎన్నడు లేని విధంగా ఈ 22 నెలల పాలనలో ఎవరు ఊహించని విధంగా నిధులు సమకూర్చి అభివృధి చేశారు అని వారు తెలుపారు. ఈ సంక్షేమం అభివృద్ధినీ గ్రామం లోని ప్రతి ఇంటికి తీసుకెళ్లి వారికి వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి. నాగేష్, వీ. వెంకటరత్నం, బి. లక్ష్మణ్, టీ. రవీందర్, ఏ. వెంకటేశ్వర్లు,p. కొండయ్య, కె.నాగేశ్వరరావు, ఐ.శివసాయి, తదితరులు పాల్గొన్నారు









