శాలువాతో ఘనంగా సత్కరించిన కిలారు జగన్మోహనరావు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలో లోని వ్యవసాయ కుటుంబం నుండి ఎన్నో ఏళ్ల కష్టాల నుండి మండలంలో యువతకు ఆదర్శం గా నిలిచిన పొనుగోటి ఉపేందర్.రాష్టంలో గ్రూప్ 2 ఫలితాలలో చింతకాని గ్రామానికి చెందిన పొనుగోటి ఉపేందర్ ని శాలువాతో సత్కరించిన మాజీ చెన్నకేశవ స్వామి దేవాలయం చైర్మన్,నీటి సంఘం అధ్యక్షుడు కిలారు జగన్మోహనరావు.జగన్మోహనరావు మాట్లాడుతూ యువత ఉపేందర్ ని ఆదర్శంగా తీసుకుని చదువు మీద దృష్టి పెట్టాలని,తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్,కిలారు వేణు గోపాల్,కిలారు బాబు రావు,మాజీ ఎంపి టీ సి మెకనబోయిన రాంబాబు,రహ్మతుల్లా,షంషుద్దీన్,కోలా నాగేశ్వర్రావు,జహీర్ ఖాన్,పొనుగోటి వెంకటేష్,పొనుగోటి రత్నాకర్,కొడవకంటి మోహనరావు,గడ్డం వెంకటేశ్వర్లు.గంధసిరి శ్రీను,పొట్ల బాబు,రంగయ్య తదితరులు పాల్గొన్నారు.









