మృతుడు ఆంధ్రప్రదేశ్ చెందిన
కైలా విజయకుమార్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 28.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిలకలూరిపేట గ్రామం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ చెందిన కైలా విజయకుమార్ వయస్సు 38 సం,గత రెండు సంవత్సరాల నుండి మాసాయిపేటలోని సాఫ్రాన్ వ్యాలీ కంపెనీలో వంట మనిషిగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు.గత కొన్ని రోజులుగా కైలాష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతు నిన్న రాత్రి 9 గంటలకు భోజనం చేసి పడుకున్నాడు. ఆదివారం ఉదయం 6.గంటలకు అక్కడే మేస్త్రి గా పని చేసే శివరాత్రి కృష్ణ అతన్ని లేపిన లేవలేదుఅని అతను మరణించడని చూసి చిలకలూరుపేట లో ఉన్న విజయ్ కుమార్ భార్య కైలా అరుణ కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగగా ఆమె వచ్చి చూడగా నిజము గానే ఆరోగ్యం క్షినించి చనిపోయి ఉన్నాడు. కైలా అరుణ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై జి. చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.









