+91 95819 05907

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే ★ కొమరం భీమ్ లై గర్జించిన ఆదివాసి సమాజం ★ భద్రాచలంలో ఆదివాసి గర్జనకు తరలివచ్చిన వేలాదిమంది ఆదివాసులు

అధర్మం పై గురిపెట్టిన ఆదివాసీల విల్లంబులు.
*తమది న్యామమైన డిమాండ్ అన్న సంఘాలు*
*ఎన్నో సంవత్సరాలు గా నష్టపోతున్నామని ఆవేధన*
*తమ డిమాండ్ పరిష్కరించేవరకు పోరాటం ఆగదని వెల్లడి*
*దర్మయుద్దం సభకు ఊహించని విధంగా పోటెత్తిన ఆదివాసి సమాజం*
నేటి గదర్ ప్రతినిధి ,భట్టా భిక్షపతి(కరకగూడెం)భద్రాచలం:

:ఎన్నో ఏండ్లుగా నష్టపోతూ, గోసపడుతున్న ఆదివాసీలకు ప్రభుత్వాలు ఇకనైనా న్యాయం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కారించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భద్రాచలం లో నిర్వహించిన ఆదివాసీ ల ధర్మయుద్దం సభ ఊహించని రీతిలో ప్రజలు రావడంతో సభ పరిసర ప్రాంతాలతో పాటు భద్రాచలం పట్టణం మొత్తం ఆదివాసీలతో నిండిపోయింది. ఈ సభలో వేలాది మంది ఆదివాసీలు స్వచ్చందంగా భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిజమైన ఆదివాసీల హక్కులు కాపాడాలని, తాము అన్యాయం భరించబోమని స్పష్టంచేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కారించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ సభకు ఆదివాసీ మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వక్తలు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ చైర్మన్ చుంచ.రామక్రిష్ణ,అదిలాబాదు మాజీ ఎంపీ సోయం.బాబూరావు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా.కాంతారావు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మెన్ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !