+91 95819 05907

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు :మంత్రి పొంగులేటి

*మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎన్నికలు*

-కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు

-అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు మండలాల వారీగా కమిటీలు

-గ్రామాలన్నింటికి చేరిన సంక్షేమ పథకాలు.. అభ్యర్థులకు బలమవుతాయి

మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా గ్రామాల్లోని ప్రతీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.

కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా సోమవారం ఆయన పార్టీ పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓ జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అనే జాబితా వెలువడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓను కొందరు హైకోర్టులో సవాలు చేశారు. అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఆ తీర్పును స్వాగతిస్తూ.. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు.

గ్రామాల్లో విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రతి మండలానికి తొమ్మిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే గ్రామం నుండి అనేక మంది ఆశావహులు ఉన్నప్పుడు గెలుపు అవకాశాలు, పార్టీపై విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన వారికి వేరే అవకాశాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు” అని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !