+91 95819 05907

అశ్వారావుపేటకు రూ. 15 కోట్ల నిధులు: అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం

20 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ; బస్ స్టాండ్‌లు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంపై ప్రకటన.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 29: అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో గతంలో నిర్మించిన 20 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి, వారికి ఇళ్లను కేటాయించారు. అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు నిధులు మంజూరు చేసిందని ప్రకటించారు. ఈ నిధులతో చేపట్టబోయే ప్రధాన అభివృద్ధి పనులను ఆయన వివరించారు: నూతన మున్సిపాలిటీ భవనం నిర్మాణం, ఆధునిక మున్సిపల్ మార్కెట్ నిర్మాణం, పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు, దొంతికుంట చెరువు నందు ట్యాంక్ బండ్ అభివృద్ధి, సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం దీంతో పాటుగా, అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, మందలపల్లి, చండ్రుగొండ బస్ స్టాండ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను కూడా ఆయన తెలియజేశారు. రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు: నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా నిధులు సమీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా: కొత్త బీటీ రోడ్లు నిర్మాణం, రైతుల కోసం పంట పొలాలకు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్లు, పలు గ్రామాల్లో సైడ్ డ్రైనేజీల నిర్మాణం త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పలు శాఖల అధికారులు, మండల నాయకులు జూపల్లి ప్రమోద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !