స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి టీపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు కి కృతజ్ఞతలు తెలిపిన రేచర్ల మల్లేశ్వరి..!
నేటి గదర్ న్యూస్, వైరా:-
వైరా వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రేచర్ల మల్లేశ్వరి కి టీపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు ఘనంగా సన్మానించారు.అనంతరం వ్యవసాయ డైరెక్టర్ రేచర్ల మల్లేశ్వరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గట్ల రంగారావుకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి కృతజ్ఞతలు తెలిపారు.తన పదవికి న్యాయం చేస్తానని ఒక రైతుబిడ్డగా, రైతుల పక్షాన నిలబడుతానని రైతులు పండించిన ప్రతి గింజను, కొనుగోలు చేసే విధంగా సహకరిస్తానని అన్నారు. వ్యవసాయ పంటను నిల్వ చేయడానికి గోదాం లో కావాల్సిన సౌకర్యాల కోసం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో. కట్ల రంగారావు, కట్ల నాగరాజు, కట్ల సంతోష్, నార్ల రమేష్, దగ్గుపాటి వీరరాజు,భాస్కర్, రేచర్ల నాగేశ్వరరావు,రేచర్ల రామారావు,ఆది శ్రీకాంత్ (బాబి),రేచర్ల పుల్లయ్య,రేచర్ల ప్రభాకర్ రావు,రేచర్ల రాముడు, రేచర్ల సాయిరాం, వీరబాబు. తదితరులు పాల్గొన్నారు.









