+91 95819 05907

నీళ్ల కోసం రోడ్డెక్కిన ఊట్లపల్లి గ్రామస్తులు: ‘కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధ లేదు’ అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు

నీళ్ల కోసం రోడ్డెక్కిన ఊట్లపల్లి గ్రామస్తులు: ‘కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధ లేదు’ అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు

డ్రైనేజీ సమస్యలు, పైప్‌లైన్ లీకులు పట్టించుకోవట్లేదని ఆవేదన; ‘పన్నుల వసూలుకు టైముంటుంది, రిపేర్లకు ఉండదా?’ అని ఆగ్రహం

నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, అక్టోబర్, 01: నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహంతో అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామస్తులు బిందెలతో రోడ్డు ఎక్కారు. తాము పనులు మానుకొని నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పంచాయతీ సిబ్బంది, కార్యదర్శి పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్లే తాము ఉదయాన్నే నీళ్ల కోసం చాలా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. “ఇంటి పన్నుల మీద డబ్బులు వసూలు చేయటానికి మాత్రమే ఖాళీ ఉంటుంది. కానీ, నీళ్ల పైపులు ఖరాబైతే బాగు చేయాలనే ఉద్దేశం లేదా?” అని వారు పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో బ్రీజింగ్ (పూడిక తీయడం) లేకపోవడం వల్ల జ్వరాలు వస్తున్నాయని ఎన్నిసార్లు పంచాయతీ సిబ్బందితో చెప్పినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. “పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే చెవుటోడి ముందు శంఖం ఊదినట్టేగాని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు” అని మండిపడ్డారు. దీనికి తోడు ఇప్పుడు నీళ్ల పైపులు పగిలి నీళ్లు లేకపోయినా తమ బాధ తీర్చేవారు ఎవరూ లేరని, అందుకే ఆడవాళ్లందరం బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు తాము రోడ్డు మీద బిందెలతో నిలబడలేదని గ్రామస్తులు గుర్తు చేశారు. “ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మేము ప్రతి దానికి బాధపడుతున్నామని, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని” గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు తక్షణమే స్పందించి తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !