1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి. 1989లో జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.ఇక ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణ వార్త తెలిసిన రాజకీయ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం దామోదర్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం రోజున అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా బంధువులు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.









