నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మరణం చెందగా.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గల దామోదర్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన పార్థివ దేహం వద్ద రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ఘన నివాళులర్పించారు. నల్లగొండ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడని, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని.. వారి సేవలను స్మరించుకున్నారు. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Post Views: 25









