+91 95819 05907

మధిర నియోజకవర్గంలోని ఓటర్లకు రుణపడి ఉంటాం.

అభివృద్ధి అంటే భట్టి-భట్టి అంటే అభివృద్ధి

రామ కృష్ణాపురం సభ లో మల్లు నందిని విక్రమార్క.

పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో కి చేరికలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

చింతకాని మండల పరిధిలోని రామ కృష్ణాపురంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క శుక్రవారం రాత్రి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సభలో తిరపతి గోవిందరావు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అందరూ సహకరించాలని,ఇదే నా చివరి ఎన్నికలు అని అన్నారు గాదె రామారావు విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేయాలి అని కోరారు.మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ని ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు.ఓటు వేసి భట్టి విక్రమార్కను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖమంత్రి చేశారు అంటే మీ అందరి మద్దతు తో మీ అందరి కోసం పని చేసే అవకాశం లభించింది అని అన్నారు అభివృద్ధి అంటే భట్టి విక్రమార్క-భట్టి విక్రమార్క అంటే అభివృద్ధి అని తెలిపారు.మండలంలోవచ్చే ఎన్నికల్లో కొత్త,పాత నాయకులు అంటూ ఏమీ లేకుండా అందరూ కలిసి పని చేయాలని గాదె రామారావు గెలుపు కోసం కృషి చేయాలి అని కోరారు ,మీ మండలంలో,గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు.మీ మీ గ్రామంలో అభివృద్ధి కి కలిసి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం రామ కృష్ణ పురం గ్రామంలో అరవై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు,వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి మల్లు నందిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చింతకాని,ముదిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు,ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉప అధ్యక్షులు మడుపల్లి భాస్కర్ గౌడ్,కన్నెబోయిన గోపి,బందెల నాగార్జున,మాజీ సర్పంచ్ తిరపతి గోవిందరావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్, కూరపాటి కిషోర్ ఆత్మ కమిటీ సభ్యులు కొప్పుల గోవిందరావు,సట్టు వెంకటేశ్వర్లు,తోటకూరా ప్రగతి,గాదె రామారావు,తిరుపతి యదయ్య,కోపూరి పూర్ణయ్య,పెంట్యాల పుల్లయ్య,నెల్లూరి కోటి,తూము కోటేశ్వర్రావు,తూము అంజయ్య,కంచుమర్తి రామకృష్ణ,షేక్ ఖాసీం,పాషా,వనం చిన్నప,అబ్దుల్ మజీద్ మరియు తదితరులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !