+91 95819 05907

మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి హర్షం -బిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అరుదైన నియామకంపై శుభాకాంక్షలు!

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 04: బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకి కేంద్రంలో అరుదైన గౌరవం దక్కడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి హర్షం వ్యక్తం చేశారు. పెట్రోలియం, సహజ వాయు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం లో సభ్యుడిగా ఆయన వరుసగా మూడోసారి నియామకం కావడంపై ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి మాట్లాడుతూ వద్దిరాజు రవిచంద్ర కి దక్కిన ఈ గౌరవం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాల విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించే ఈ స్థాయి సంఘంలో మూడోసారి స్థానం దక్కడం ఆయన నిబద్ధత, అనుభవం, సమర్థతకు నిదర్శనమని కొనియాడారు. ​బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ రవిచంద్ర నిరంతరం కృషి చేస్తున్నారని సున్నం నాగమణి పేర్కొన్నారు. ఈ నియామకం ద్వారా భవిష్యత్తులో దేశ ఇంధన రంగంలో మార్పులకు కృషి చేస్తూ, ప్రజలకు మరింత చేరువవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ సేవలను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, వారికి తన మరియు అశ్వారావుపేట నియోజకవర్గం ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !