నెంబర్ లేకుండా పేర్లు రాయొద్దు
వైరా ఎస్సై పుష్పాల రామారావు.
నేటి గదర్ న్యూస్, వైరా:-
వాహనాల నెంబర్ ప్లేట్లపై తప్పనిసరిగా వాహన నెంబర్ ఉండాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనానికి ముందు వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ పై వాహన నెంబరు తప్పకుండా ఉండాలి అని అన్నారు. అలా కాకుండా వాహన లకు వెనుక నెంబర్ ప్లేట్ పై వాహన నెంబర్ కనిపించకుండా పేర్లు రాస్తే అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక వాహనానికి ఆ బండి నెంబర్ ప్లేట్ చాలా ముఖ్యమని కానీ ఇటీవల కాలంలో కొందరు నెంబర్ ప్లేట్లపై నెంబర్ లేకుండా పేర్లు రాస్తున్నారని అలా రాయటం వాహన నిబంధన ప్రకారం చట్ట విరుద్ధమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనానికి తప్పనిసరిగా ముందు వెనక నెంబర్ ప్లేట్ పై నెంబర్ కలిగి ఉండాలి .అదేవిధంగా వాహనానికి మించిన సైలెన్సర్లు పెట్టి శబ్దాలు చేయొద్దని సూచించారు, ఎవరైనా వెళ్లేటప్పుడు అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ సైలెన్సర్ శబ్దాలు చేస్తే అలాంటి వారి వివరాలను బండ్ల నెంబర్లను పోలీసులకు అందించాలని సూచించారు, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ,ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్స్ లేకుండా నెంబర్ వేయకుండా వెనుక పేర్లు రాసుకున్న వాహనాలు పట్టుబడితే అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై రామారావు తెలిపారు.









