*అందరిచూపు…, నేడు హైకోర్టు వైపు…!!!*
*తెలంగాణ రాష్ట్రమంతా ఉత్కంఠ…!!!*
*రాష్ట్రంలో కొంత కాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడనుంది.* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.
ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయా? లేదా? ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? లేదంటే వాయిదా పడతాయా? వంటి అంశాలన్నింటికీ సమాధానం దొరకనుంది
*ఇంప్లీడ్ పిటిషన్లు*
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో నెం 9 జారీ చేసింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ సైతం 41, 42 జీవోను జారీ చేసింది. ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు (రిజర్వేషన్లు 50% దాటొద్దు) విరుద్ధమని, ఆ జీవోలను కొట్టేయాలని రెడ్డి జాగృతి నేత బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల27న హౌస్‌మోషన్పిటిషన్దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో కోర్టు 1లో 42 అంశంగా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్ ధర్మాసనం ఎదుటకు రానున్నది. ఈ పిటిషన్‌పై దాదాపుగా 25 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లీడ్ పిటిషన్ ధాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూజుల శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, చరణ్ కౌశిక్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సహా అనేక మంది పిటిషన్లుదాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా వీరందరూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా గుర్తింపు రావడానికి ఇదొక అవకాశమని వారు కోర్టుకు వివరించనున్నారు.
*ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం*
*బీసీ రిజర్వేషన్ల కోసం ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నది. హైకోర్టులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బృందం న్యాయనిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది. సుప్రీంలో *రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే హాజరయ్యారు.* నేడు హైకోర్టులోనూ విచారణ ఉండటంతో *స్వయంగా హాజరు కావాలని సింఘ్వీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఫోన్ చేసి రిక్వెస్టు చేశారు.* దీంతో *ఆయన నేడు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.*
*









