+91 95819 05907

తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం: ఎంపీ వద్దిరాజు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని,ఇవి నాయకులకు ఆక్సిజన్ వంటివని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా,ఏ రూపంలో వచ్చినా కూడా బీఆర్ఎస్ సిద్ధమేనని, విజయఢంకా మోగించడం తథ్యమన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో బుధవారం సప్తపది ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి రాష్ట్రం 10 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక,మన నాయకులు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా చక్కదిద్దుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు అలవికాని 432 హామీలిచ్చి,వాటిని అమలు చేయకుండా,ప్రతిపక్ష నాయకులు,పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెడుతూ “డైవర్షన్ పాలిటిక్స్”కు పాల్పడుతున్నారని ఎంపీ రవిచంద్ర తూర్పారబట్టారు.ప్రజలు ఛీత్కరించుకుంటుండడంతో దిక్కుతోచని పాలకులు తమలో తాము గొడవలు పెట్టుకుంటూ మరింత పల్చనవుతున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.అధికార పక్షం నాయకుల ప్రోద్బలంతో కేసులు బనాయిస్తున్నా భయపడవద్దని,ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని,మన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కూడా కేసులు పెట్టడం జరిగిందన్నారు.సీనియర్ జర్నలిస్టు సాంబశివరావుపై కేసు పెడితే పాత్రికేయులందరూ ఐకమత్యాన్ని చాటి చెప్పి ఆయనకు బాసటగా నిలిచారని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.అదే సంఘటిత శక్తిని మనమందరం కూడా ప్రదర్శిస్తూ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఇటీవల అధికార పార్టీ నుంచి రాష్ట్రమంతటా కూడా బీఆర్ఎస్ లోకి బాగా వలసలు పెరిగిపోయాయని,ఒక నెల రోజులు మనమందరం కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.పంచాయతీ ఎన్నికలలో పట్టణాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు,ఆ తర్వాత జరిగే మునిసిపల్ ఎన్నికలలో గ్రామాల నాయకులు పరస్పర సహకారం,సమన్వయంతో పని చేయడం ద్వారా ఘన విజయాలు నమోదు చేద్దామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.తద్వారా ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చేయడంతో పాటు రాష్ట్రంలో పెనుమార్పునకు బాటవేద్దామని,2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చి కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి,బానోతు చంద్రావతి,జేడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,పార్టీ నాయకులు ఉప్పల వెంకటరమణ, బమ్మెర రాంమూర్తి, పగడాల నాగరాజు,తిరుమలరావు,బెల్లం వేణుగోపాల్,బానోతు మంజుల,కట్టా అజయ్ కుమార్, గిరిబాబు,కట్టా కృష్ణార్జునరావు తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !