నాగులవంచ శాఖ మేనేజర్
నాగ సురేష్ కుమార్.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
అతి తక్కువ ప్రీమియంతో
ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీ
ఆరోగ్య బీమా కేవలం
తెలంగాణ బ్యాంకు ఖాతాదారులకుమాత్రమే అతి తక్కువ ప్రీమియంతో అందజేయబడుతుంది
అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగులవంచ శాఖ మేనేజర్
నాగ సురేష్ కుమార్
తెలిపారు.
కుటుంబంలో భర్త, భార్య మరియు ఇద్దరు పిల్లలు వరకు ఈ పాలసీలో కవర్ చేయబడుతుంది.ఫ్లాట్ ప్రీమియంతో కూడిన ఏకైక ఆరోగ్య బీమా ఆరోగ్య అడ్వాన్స్డ్ పాలసీ.బీమా చేయబడిన మొత్తం 5,00,000 – 20,00,000 ఉంటుంది.
OPD ఖర్చు 3000 నుండి 7500 వరకు తిరిగి చెల్లించబడుతుంది.
వయస్సు 18-55 సంవత్సరాలు (పిల్లల వయస్సు 3 నెలలు అంతకంటే ఎక్కువ).
55 సంవత్సరాల వయస్సు వరకు వైద్యం తనిఖీ లేకుండా పాలసీ ఇవ్వబడును.ఇప్పటికే ఉన్న వ్యాధి 2 సంవత్సరాల తర్వాత వర్తిస్తుంది.60 రోజుల ముందు ఆసుపత్రి ఖర్చులు మరియు 90 రోజుల తరువాత ఆసుపత్రి ఖర్చులు కవర్ చేయబడుతుంది.కుటుంబం యజమాని యొక్క వయసునీ బట్టిప్రీమియంనిర్ణయించబడుతుంది.పాలసీ యొక్క ప్రారంభం మొదటి 30 రోజుల తర్వాతవర్తిస్తుంది.ప్రమాదవశత్తు జరిగే చికిత్సలకు తక్షణమే చికిత్స లభ్యమవుతుంది
అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగులవంచ శాఖ మేనేజర్
నాగ సురేష్ కుమార్
తెలిపారు.









