మృతుని కుటుంబనకి ఆర్ధిక సహాయం పంపిన ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్వి.
నేటి గదర్ కరకగూడెం:తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఏడూళ్ళ బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు.అతనికి ముగ్గురు ఆడపిల్లలే, వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న అటవీ శాఖ మహిళా అధికారిణి ఏడూళ్ళ బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది.ఆడపిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది.కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది.
తేజస్వి ఫోన్ చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో
పోలెబోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు గ్రామ పెద్ద మనుషులు కలిసి అందజేశారు.
గ్రామ పెద్ద మనుషులు బంధువులు తేజస్వి నికి ప్రత్యేకంగా అభినందించారు.









