నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఇద్దరు పురుషుల మధ్య స్నేహం, అసహజ శృంగారనికి దారి.. చివరికి హత్య.
యూట్యూబ్‌లో చూసి, శబ్దం చేయకుండా చంపడం, మృతదేహాన్ని ముక్కలు చేయడం నేర్చుకొని దారుణం
పూర్తి వివరాలోకి వెళ్తే..
ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, అశోక్ ఇద్దరూ స్నేహితులు.ఆ స్నేహం కాస్త స్వలింగ సంపర్కులుగా మారారు.తరచూ అశోక్ వద్దకు వచ్చి అశ్లీల కార్యకలాపాలు చేసి డబ్బులు ఇచ్చి వెళ్లడం అలవాటు చేసుకున్న వెంకటేశ్వర్లు.
ఈ క్రమంలో వెంకటేశ్వర్లు వద్ద డబ్బులు బాగా ఉన్నాయని గ్రహించి అతన్ని చంపేసి డబ్బు మొత్తం లాక్కుందామని పథకం వేసిన అశోక్, తన మరొక స్నేహితుడు పెంటి కృష్ణయ్య.గత నెల 16న ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లును నిద్రలో ఉండగా, తల నరికి చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కవర్లలో పెట్టి పలు చోట్ల పారేసిన అశోక్, కృష్ణయ్య.. వీరిద్దరికీ సహాయం చేసిన నగ్మా అనే మహిళ.
వెంకటేశ్వర్లు మెడలో ఉన్న 3 తులాల బంగారం తీసుకొని, అతని ఫోన్‌లోని ఫోన్ పే నుండి తరచూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన అశోక్.
వెంకటేశ్వర్లు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు కాగా.. తల, చేతులు లభించడంతో మర్డర్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులు.
వెంకటేశ్వర్లు ఫోన్ పే నుండి డబ్బులు బదిలీ అవ్వడం గ్రహించి అశోక్‌ను అరెస్ట్ చేయగా, బయటపడ్డ సంచలన విషయాలు.
వెంకటేశ్వర్లు మృతదేహంలోని కొన్ని శరీర భాగాలను నదిలో వేయడంతో ఇంకా దొరకని మొండెం. పోలీస్లు కేసు నమోదు చేశారు.









