భద్రాచలం:
“బీసీ లను నమ్మబలికి ఓట్లు సేకరించడమే తప్ప, ఆ వర్గాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ రోజు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్పగా ప్రచారం చేసిన కామారెడ్డి డిక్లరేషన్ రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ లను మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో చట్టబద్ధత లేని జీఓ నంబర్ 9 ను తెచ్చారు,” అన్నారు.
“కోర్టు విచారణ సమీపిస్తున్న సంగతి తెలిసీ, ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి హడావుడి చేస్తోంది. రాజ్యాంగం, చట్టం పట్ల కనీస అవగాహన లేని ఈ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పే సమయం దగ్గరపడింది. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలి. లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బిడ్డలే తగిన పాఠం చెబుతారు,” అని హెచ్చరించారు.









