స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేకనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.
నేటి గదర్ న్యూస్, వైరా:-
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేకనే 42 శాతం రిజర్వేషన్లు అంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. మాయ మాటలు చెప్పి గతంలో బీసీలను మోసం చేసి గద్దెనెక్కింది.ఈ కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు కూడా అదే మోసంతో స్థానిక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. ఈ నోటిఫికేషన్ వల్ల ఇప్పటికే గ్రామాలలో ఆశావాహులు ఖర్చులపాలయ్యారని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 420 హామీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొట్లాడాలి. అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఢిల్లీ వేదికగా జరగాల్సిన పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని, వారి చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు.









