నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్, పందిలపల్లి గ్రామాలలో వరి పంట పొలాలు పరిశీలించిన చింతకాని మండల వ్యవసాయ శాఖ అధికారి సోమలపల్లి మానస, ఈ సందర్భంగా మానస వరి పొలాలను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తున్నట్లు గమనించినారు. ఆమె మాట్లాడుతూ ఆకుల పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి, అంచుల వెంబడి అలలు మాదిరిగా ఎండిపోవడం జరుగుతుందని ఈ తెగులు లక్షణాలు రైతులు వెంటనే గమనించి పై పాటుగా, నత్రజని ఎరువులు వెయ్యడం వలన తాత్కాలికంగా నిలిచి పోతుందని సూచించినారు. మరియు ఈ తెగులు పూర్తిగా నివారించడానికి ఎలాంటి మందులు లేవని. తొలి దశలోనే రైతులు గమనించి ప్లాంటమైసిన్, పోష మైసిన్, 0.2 గ్రా లేదా అగ్రి మైసిన్ 0.4 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు కాపర్ శిలీంద్ర నాసీనలను పిచికారి చేయరాదని, ముఖ్యంగా ఈ తెగులు సామాగ్రా యాజమాన్య చర్యలో భాగంగా ఆఖరి దఫాగా ఫొటాష్ ఎరువును ఎకరానికి15-20 20 కిలోలు చొప్పున వేయాలని. మరీ ముఖ్యంగా వరిలో పాత నీరు తీసివేసి కొత్తనీరు ఎప్పటికప్పుడు పెట్టుకోవాలని తద్వారా ఈ తెగులు అరికట్టవచ్చు అని సూచించినారు.ఈ కార్యక్రమంలో పందిలపల్లి ఏఈఓ కార్తీక్.మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.









