రోడ్డుకిరువైపుల వాహనాలు నిలుపరాదు
__నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు__
__యస్. ఐ వీరేందర్_
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారికి ఇరువైపుల భారీ వాహనాలను నిలుపడం వలన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నందున రోడ్ పైన,రహదారికి పక్కన అకారణంగా వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, చలాన్లు విధిస్తామని చింతకాని యస్. ఐ వీరేందర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మంగళవారం పందిళ్ళపల్లి గ్రామ శివారు పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపివుంచిన పలు లారీలకు చలాన్లు విధించామని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి అకారణంగా వాహనాలను పార్క్ చేయవద్దని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Post Views: 50









