+91 95819 05907

నారంవారిగూడెంలో వానపాముల ఎరువుపై రైతులకు అవగాహన

ఉద్యాన కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వర్మికంపోస్టింగ్ కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 14: మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల విద్యార్థులు మంగళవారం రైతులకు వర్మికంపోస్టింగ్ (వానపాముల ఎరువు తయారీ)పై అవగాహన కల్పించారు. ఉద్యాన కళాశాల మెజర్ల విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు వర్మికంపోస్టింగ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు మాట్లాడుతూ ఉద్యాన పంటలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మరియు చెత్తను బయట పారవేయకుండా, వాటిని ఉపయోగించి అధిక నాణ్యత గల వానపాముల ఎరువును (వర్మికంపోస్ట్) తయారు చేసుకునే విధానాన్ని రైతులకు ప్రయోగపూర్వకంగా చూపించారు. దీని వలన పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గి, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని, పండించిన ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుందని వివరించారు. ఈ విధంగా సొంతంగా ఎరువులు తయారు చేసుకోవడం వలన రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు కృష్ణ నాయక్, వంశీ, నగేష్, ధర్మతేజ, సురేంద్రలతో పాటు గ్రామ సెక్రటరీ రమేష్ మరియు నారంవారిగూడెం రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !