దమ్మపేట మొద్దులుగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ నేతల పరామర్శ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 14: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, మొద్దులుగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పర్వతనేని ప్రభాకర్ రావుని అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావుని పరామర్శించిన మెచ్చా నాగేశ్వరరావు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆయన వెంట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ రమేష్, సాయిల రామారావు, నరకుల రాఘవరావు, జాలిపర్తి సాంబయ్య, దొడ్డ శ్రీను, సోయం శ్రీను, కూరం రాజు, సున్నం రాము, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 34









