జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపధ్యంలో వెంగళరావు నగర్ పరిధిలోని 120,129 బూత్ లలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,విత్తనాభివృధ్ధి సంస్ధ చైర్మన్ అన్వేష్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తు ఓట్లు అభ్యర్థిస్తున్నారు..ఈ సందర్భంగా వారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు..ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.. అధికార పార్టీకి అండగా నిలవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు..
Post Views: 16









